|
నేను దేవుడిని నమ్ముతాను.ఆ దేవుడి దయతో పాటు తన తండ్రి, మహానేత దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని అందువల్ల తాను, తన తల్లి తప్పకుండా గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో తమ ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తమ కుటుంబాన్ని ముక్కలు చేశారని ఆవేదన చెందారు.నైతిక విలువలు మరచి అమ్మపై బాబాయిని పోటీకి నిలిపిందన్నారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం కోసమే తన తల్లి విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు.
ఈ ఎన్నికలలో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. డబ్బు పంపిణీ కోసమే మంత్రులు ఇక్కడ తిష్టవేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు చాలా మంది డబ్బుతో దొరికారని, అదే నిదర్శనమని చెప్పారు. ఈ విషయం ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ మంత్రులు ఇక్కడ తిష్టవేసి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు.

0 comments:
Post a Comment