|
కడప జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలు తమకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీకి చెందిన మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి ఆరోపణలు సంధించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయనా ఓ మంత్రేనా.. చెప్పెందుకు నోరెలా వస్తుంది.. కాస్తైనా సిగ్గూఎగ్గూ ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై భూమన మాట్లాడుతూ అధికార యంత్రాంగం ఎపుడైనా.. ఎక్కడైనా ప్రతిపక్షానికి సహకరిస్తుందా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి మాటలు మాట్లాడేముందు కాస్త ఆలోచన చేయరా అంటూ ప్రశ్నించారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ అని, అందులో మంత్రిగా ఉన్నది డీఎల్ కాదా అని అడిగారు.
అధికార పార్టీ మంత్రులు, నేతలు ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాలను పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకుని తమ ఇష్టరాజ్యంగా చెలాయిస్తుంటే ఒక మంత్రిగా ఉండికూడా ఆయన ఆ తరహా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కడప ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ.. ప్రభుత్వ వాహనాలను డబ్బు పంపిణీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటుందీ తామా అధికార పార్టీ సభ్యులా అంటూ ప్రశ్నించారు.
ప్రత్యర్థిగా కాకుండా ఒక శత్రువుగా చూస్తున్న వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కడపలోనే మొహరించి ఉన్నారని భూమన ఆరోపించారు.

0 comments:
Post a Comment