|
జగన్‌కు జై అంటూ పీఆర్పీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి దూకిన కాటసాని రామిరెడ్డి తిరిగి ప్రజారాజ్యం గూటికే చేరారు. శుక్రవారం కాటసాని పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవితో సమావేశమై తను పార్టీలో కొనసాగుతానని చెప్పినట్లు సమాచారం.
తను జగన్ పార్టీలో ఇమడలేని పరిస్థితి తలెత్తిందని కాటసాని వెల్లడించినట్లు సమాచారం. ముఖ్యంగా వైఎస్ జగన్ కడప ఓటర్లను గ్రూపులుగా విభజించి చూడటాన్ని తాను జీర్ణించులేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మరోవైపు తన నియోజకవర్గ పరిధిలోని ప్రజల అభిప్రాయాలను వైఎస్ జగన్ పట్టించుకోవడం లేదనీ, అంతా ఒంటెద్దు పోకడ పోతున్నారని తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. అటువంటి నాయకునితో ప్రజల అభీష్టం నెరవేరదన్న అభిప్రాయంతోనే తిరిగి సొంత గూటికి వచ్చినట్లు కాటసాని వెల్లడించారు.

0 comments:
Post a Comment