|
ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ ఆహ్లువాలియాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ జనాకర్షక పథకాలే తప్ప వాస్తవాలకు అనుగుణంగా పనిచేయడం లేదని ప్రణాళికా సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలపై పునఃసమీక్షించుకుంటే మంచిదని సూచించారు.
ఉచిత విద్యుత్ వంటి పథకాలపై ప్రభుత్వం పునరాలోచన చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చింది.
ముఖ్యంగా నీటిపారుదలా వ్యయం అనూహ్యంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే రాష్ట్రాభివృద్ధి రేటు మాత్రం బాగానే ఉన్నదని అభిప్రాయపడింది. 2011-12 సంవత్సరానికిగాను ప్రణాళికా వ్యయం 43వేల కోట్లుగా నిర్థారణ చేసింది. సేవల రంగంలో ఉన్న కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది
ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ప్రజా ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసిన పథకాలైన ఉచిత విద్యుత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకునే ప్రసక్తే లేదన్నారు. అంతేకాదు... వచ్చే మూడేళ్లలోపు 35 ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. ఇక బడ్జెట్లో కేటాయించిన దానికంటే ప్రణాళికా సంఘం 17 శాతం ఎక్కువగా నిధులను కేటాయించిందనీ, అందుకు ప్రత్యేకంగా కమిషన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.

0 comments:
Post a Comment