|
కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటర్లు అన్ని పార్టీలు ఇచ్చిన డబ్బులను తీసుకుని జేబులో పెట్టుకుంటారని, ఓట్లు మాత్రం వారికి నచ్చిన ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తారనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు అధికార దర్పం, అహంకారం, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్నాయని చెప్పారు. తాము కేవలం విశ్వసనీయతను నమ్ముకుని ఓటర్ల వద్దకు వెళ్లినట్టు చెప్పారు.
తాము ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయలేదన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇష్టానుసారంగా డబ్బులు, మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా.. ప్రజలు మాత్రం తమకే పట్టంకడతారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలకు గుర్తుగా ఓటర్లు తమ మద్దతును తెలుపుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

0 comments:
Post a Comment