|
కడప పౌరుషం ఏంటో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రుచి చూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆయన మాట్లాడుతూ.. కడప జిల్లా అంటే రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీలో సోనియా కూడా ఖంగుతినేలా రుచి చూపించాలన్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తమ కుటుంబంపై కక్ష్యసాధింపు చర్యలు చేపట్టిందని ఆరోపించారు. పార్టీ కష్టకాలాల్లో ఉండగా తన తండ్రి వేల మైళ్ళు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఒక్క రాజశేఖర్ రెడ్డికే చెందుతుందన్నారు.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తన కుటుంబంలో చిచ్చుపెట్టి సొంతం బాబారుని అమ్మపై పోటీ పెట్టడానికి కుయుక్తులు పన్నిందంటే కాంగ్రెస్ పార్టీ ఎంత నీచ రాజకీయానికి వడిగడుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో పోలీసులను ఉపయోగించి ఎలాగైనా తన తల్లిని, తనను ఓడించ డానికి శక్తి, యుక్తులు పన్నుతున్నారన్నారు.
ప్రస్తుతం కడపలో ఒక కేంద్రమంత్రి, 14 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజారాజ్యం పార్టీకి చెందిన నాయకులు అందరూ ఒక్కటై ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. వీరందరికీ తగిన గుణపాఠం నేర్పేలా ఓటర్లు తీర్పు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

0 comments:
Post a Comment