|
తన శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆ పార్టీ అధినేత చిరంజీవి వద్దకు పారిపోయారని సినీ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ఆర్కే.రోజా ఆరోపించారు.యువనేత జగన్మోహన్ రెడ్డిపై కాటసాని చేసిన విమర్శలపై రోజా ఘాటాగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు అనుసరించడం లేదన్నారు. ఆయన ఉండి వచ్చిన తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల అధ్యక్షులే ఒంటెద్దు పోకడలు అనుసరిస్తున్నారని ఆరోపించారు.ప్రరాపా కార్యాలయానికి చివరకు నాగబాబు వచ్చినా హాలులో ఉండే నేతలంతా నిలుచొని సలాం చేయాలన్న నిబంధన ఉన్నదని చెప్పుకొచ్చారు. అలాగే, చంద్రబాబు ఇంటి మనిషి గేటు ఆయన నివాసం గేటు తీసిని ఎందుకు వచ్చావని అడిగే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని రోజా చెప్పుకొచ్చారు. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం ఖాయమన్నారు

0 comments:
Post a Comment