06 May 2011

కరుణానిధి కుమార్తెగా పుట్టడమే నా పాపం: కనిమొళి

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కుమార్తెగా పుట్టడమే తాను చేసిన పాపం అని రాజ్యసభ సభ్యురాలు కనిమొళి వాపోయారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. ఈ కుంభకోణంలో తనకెలాంటి సంబంధం లేదని ఆమె వాదించారు. కరుణానిధి కుమార్తెగా పుట్టడం వల్లే తనపై ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని ఆమె వాపోయారు.
అంతేకాకుండా, ఈ 2జి స్కామ్ లో ప్రధాన సూత్రధారి టెలికామ్ మాజీ మంత్రి ఏ.రాజాయేనని ఆమె ఆరోపించారు. ఈ కుంభకోణంతో తమకు ఏవిధమైన సంబంధంలేదని ఆమె తరపు న్యాయవాది గట్టిగావాదించారు. అయితే ఆమె వాదనలో బలం లేదని స్పెషల్ కోర్టు పేర్కొంది.
ఇదిలావుండగా, ఈ కుంభకోణం కేసులో ఆమెను అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఆమె ముందస్తు బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి రేపటికి వాయిదా వేసింది.

D.M.k, General Issues

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us