|
దివంగత మహానేత వైఎస్ఆర్ కుటుంబంపై విమర్శలు చేసే అర్హత ఏ ఒక్కరికీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, కేంద్ర మంత్రిగా కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
2004కు ముందు రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పురంధేశ్వరి దంపతులకు మహానేత వైఎస్‌ఆర్ పిలిచి పదవులు కట్టబెట్టారని గుర్తు చేశారు. ఆ విశ్వాసాన్ని మరచిపోయిన పురంధేశ్వరి ఆయన కుటుంబంపైనే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.

0 comments:
Post a Comment