07 May 2011

చిరంజీవి "పొలిటికల్ మెగాస్టార్" అవుతున్నారా..? కాంగ్రెస్ తీర్థం మహిమేనా...?!!

    


చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన దగ్గర్నుంచి ఆయన ఇమేజ్ క్రమంగా పెరుగుతోందా...? జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ జెండా భుజంపై పడేసరికి ఆంధ్రలో బలమైన కాంగ్రెస్ నాయకుడు చిరంజీవే అనే ముద్ర బలపడుతోంది..? మొన్నటి కడప ఉపఎన్నికల పర్యటనలో చిరంజీవి సభలకు వచ్చిన స్పందన ఇదే చెపుతోందా..? అన్నిటికీ మించి ఆయనను విడిచి వెళ్లిన కాటసాని రాంరెడ్డి తిరిగి చిరంజీవి వద్దకు రావడం దీనినే సూచిస్తోందా..? అనంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
నిజానికి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం ప్రకటన చేసే ముందు... ఆ తర్వాత చిరంజీవి పలు విమర్శలను ఎదుర్కొన్నారు. పార్టీని నడపలేకనే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారని చాలామంది ఎగతాళి కూడా చేశారు. అయితే వాటిని చిరు పట్టించుకున్నట్లు కనబడలేదు. సినిమాల్లో ఇంతకన్నా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాననీ, వాటి ముందు ఇటువంటివి చాలా చాలా చిన్నవని ఆయన కొట్టి పారేశారు.

లక్ష్యం పెద్దదైనపుడు వేదిక కూడా పెద్దదిగానే ఉండాలనీ, అయినా తన వేదిక మార్చుకున్నా లక్ష్యాన్ని మార్చుకోలేదనీ, పైగా సోనియా గాంధీ ఆధ్వర్యంలోని యూపీఎ అవినీతికి పాల్పడిన మంత్రులను ఒక్కొక్కరిగా కటకటాల వెనక్కి పంపించడాన్ని చూస్తుంటే వారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో అర్థమవుతుందని చిరు బలంగా వాదిస్తున్నారు. కనుకనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎటువంటి వెనుకడుగు వేయలేదని సమర్థించుకున్నారు.

ఇక ఇటీవల కడప ఉపఎన్నికల ప్రచారంలో చిరు చేసిన ప్రసంగాన్ని గతంలో ఆయన చేసిన ప్రసంగాలతో పోల్చి చూసినప్పుడు చాలా తేడా కనబడుతోందంటున్నారు విశ్లేషకులు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుని హోదాలో చిరంజీవి ఓ రాజకీయ నాయకునిగా అంతగా రాణించలేక పోయారనీ, అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాక ఆయన మాటల్లో చాతుర్యం, ప్రజల స్పందనకు అనుగుణంగా మాట్లాడటం, ప్రత్యర్థుల్ని వాగ్ధాటితో చిత్తు చేయడం వంటివి కనబడ్డాయంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం చిరు ఇమేజ్ పార్టీలో మెగా రేంజ్ వైపు దూసుకెళుతోందని చెపుతున్నారు




Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us