07 May 2011

బిన్ లాడెన్ హతం మా నిజాయితీకి నిదర్శనం: ఒబామా

ఆల్‌ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్‌ను హతం చేయడం ఉగ్రవాదంపై తాము చేస్తున్న పోరాటానికి నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు.

లాడెన్ హత్యతో ఈ ప్రపంచానికి మనం గట్టి సందేశాన్ని ఇచ్చామన్నారు. ఎన్ని అవాంతరాలను అధిగమించైనా అనుకొన్న న్యాయాన్ని అమలు పరుస్తామని మన దేశానికి, ప్రపంచానికి అర్థమయ్యేలా చేస్తామన్నారు.

అమెరికాలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ముఖ్యం కాదని, ఒక భయంకరమైన నేరానికి తగిన శిక్ష పడి న్యాయం జరిగిందని ఒబామా చెప్పుకొచ్చారు. మన కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాలేమంటూనే.. పాకిస్థాన్‌లో అమెరికా సైన్యం సాధించిన ఘనత కొంత ఓదార్పునిస్తుందన్నారు.

General Issues

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us