|
రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గుండు గీయించుకున్నారు. తన ఇష్ట దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి గుండు గీయించుకున్న తొలి ముఖ్యమంత్రిగా కేకేఆర్ రికార్డు సృష్టించారు. సీఎం గుండు గీయించుకోవడానికి గల కారణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల జరిగిన ఉపఎన్నికల తర్వాత తన సీఎం పీఠం పదిలంగా ఉంటే కొండకు వచ్చి మొక్కు తీర్చుకుంటానని కేకేఆర్ మొక్కుకున్నట్టు సమాచారం...పైగా తనకెంతో దగ్గరి వ్యక్తైన ఆజాద్ రాష్ట్ర ఇంచార్జిగా నియమితుడవ్వడం,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదని 2014 వరకు కిరణ్ ముఖ్యమంత్రి గా కొనసాగుతారని ఆజాద్ స్పష్టం చెయ్యడంతో కిరణ్ సంతోషముగా ఉన్నారు .
ఇప్పట్లో తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ఆయన భావిస్తున్నారు .ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దమ్మూధైర్యం ఇటు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి అటు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు లేదన్న విషయాన్ని ఆయన గ్రహించారు

అంతేకాకుండా మంత్రులంతా ముఖ్యమంత్రి సహకరించి తీరాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.దీంతో కిరణ్ కు ఆయన సర్కార్ కు డోకా లేదనే ఆయన ధీమా ధైర్యం అది సీ.ఎం హావభావాలలో స్పష్టం గా గమనించవచ్చు

0 comments:
Post a Comment