|
మహానాడు ఆఖరి రోజున పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశ పెట్టారు టిడిపి నాయకులు యనమల రామకృష్ణుడు . తీర్మానాల ఫై చర్చలో భాగంగా తెలంగాణా అంశం ,ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టే విషయం మీద కుడా చర్చ జరిగింది. తెలంగాణా మీద నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వానిదే అని ఆ పార్టీ నేత ఎర్రన్నాయుడు స్పష్టం చేశారు. జగన్ ఇన్ని రోజులూ ప్రభుత్వం తన దయతో నడుస్తుంది అని తాను తలచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చెయ్యగలనని ఉట్టి ప్రగల్భాలు పలికారు అని , తన మాటలతో ఢిల్లీ పెద్దల్ని భయపెట్టి తన పనులు చేసుకుందామని చూశారని , ఈరోజున బాబు విసిరినా సవాల్ స్వీకరించే దమ్ము లేని జగన్ తోక ముడిచాడని జగన్ ని తూర్పారబట్టారు ఎర్రం. తన ఎమ్మెల్యేలను చేతనైతే గవర్నర్ వద్దకు పంపి తమకు ప్రభుత్వం మీద విశ్వాసం లేదని చెప్పించ వచ్చునని , జగన్ అది కుడా చెయ్యలేక పోయాడని ,కానీ తాము వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నామని ,అందుకు మహానాడులో కుడా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు . కనిమొళి , రాజా , కల్మాడి మాదిరిగానే త్వరలో జగన్ కుడా జైలు కేల్లడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్ర ప్రజలు జగన్, కేసీఆర్ లకు దూరం గా ఉండాలని ఆ పార్టీ నేత దేవేందర్ గౌడ్ అన్నారు

0 comments:
Post a Comment