16 May 2011

సీఎం ఓ దద్దమ్మ !


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చవట, దద్దమ్మ అని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. మంత్రు లది కూడా అదే తీరని తిట్టిపోశారు. రైతు సంక్షేమం పట్ల కృషి చేస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేయనప్పుడు క్షమాపణ చెప్పి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులందరూ కలిసి ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారమౌతాయని... రండి.. కలిసి పోరా డుదామని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకునేందుకే ప్రాధాన్యతనిస్తున్నాయని ఆరోపించారు. 2004లో ధరలను పెంచబోమని, నియంత్రిస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు మాట మార్చాయన్నారు.


పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పలుమార్లు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. అది చాలదన్నట్లుగా శనివారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్‌పై లీటరుకు రూ.5 పెంచారన్నారు. చేతకాని అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాల వల్లనే రైతులు మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపిం చారు. దామరచర్ల, మిర్యాలగూడ మండలాల్లోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆదివారం పరి శీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. అంతర్గత కుమ్ములాటలతో రైతుల క్షేమాన్ని విస్మరించారన్నారు.
see more in www.suryaa.com

T.D.P

1 comments:

Anonymous said...

Prati chavata chepe mata ade so babu also chavata

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us