|
జగన్మోహన్ రెడ్డి ... ఈ పేరు బహుశా రెండు మూడు ఏళ్ళ ముందువరకు ఎవరు పెద్దగా ఎవరూ విని ఉండరు...38 ఏళ్ళ ఈ యువ రాజకీయ నాయకుడు, తలలు పండిన నేతలున్న కాంగ్రెస్ ని ,సోనియా గాంధీనీ ఎదిరించి ఢిల్లీని డీకొని కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చాడు.
ఆ... ఏం చేస్తాడులే తిరిగి కాంగ్రెస్ గూటికీ చీరల్సిందే... అని అనుకున్న ఢిల్లీ అధినాయకత్వానికి తానేంటో చూపించాలి అనుకున్న జగన్ ,ఉప ఎన్నికలనే అస్త్రం గా ప్రయోగించి భారీ మెజారిటీ సాధించి ప్రజలు తన వైపే ఉన్నారు, ఇక కాంగ్రెస్ దుకాణం సర్దుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పాలనుకున్నారు.అనుకున్న దానిలో దాదాపుగా విజయం సాధించారు కుడా.
జగన్ కు అత్యధిక మెజారిటీ రావడం ఖాయం గా కనపడుతున్న నేపధ్యంలో ,తమ పార్టీ నేతలే జగన్ కు నాలుగు లక్షల ,ఐదు లక్షల మెజారిటీ వస్తుంది
అంటుంటే 10 జనపథ్ గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. తన దూకుడు, చాణక్యంతో..ఢిల్లీనే డీ అంటే డీ అనేలా , తెలుగు వారి ఆత్మ గౌరవం తాకట్టు పెట్టిందని నేరుగా సోనియా నే టార్గెట్ చేస్తూ
ఎన్.టి.ఆర్ తారవాత అంతగా కాంగ్రెస్ హై కమాండ్ కు గుబులు రేపుతున్న జగన్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసీ దాకా నిద్రపోయేలా కనిపించట్లేదు.
ఎన్.టి.ఆర్ తారవాత అంతగా కాంగ్రెస్ హై కమాండ్ కు గుబులు రేపుతున్న జగన్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసీ దాకా నిద్రపోయేలా కనిపించట్లేదు.
ఒకవేళ నిజంగానే జగన్ పార్టీ రెండు స్థానాలలోనూ భారీ మెజారిటి తో గనక గెలిస్తీ ఆ తరువాత అతని ఎత్తుగడలు ఎలా ఉంటాయా అని ఢిల్లీ అధిష్టానం తలలు పట్టుకుని కూర్చుంది .
ఇదిలా ఉండగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మీద అంతంత మాత్రం గానే ఆశలున్నా , ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ కోటకు బీటలు వారవు అని గత కొనేళ్ళుగా నిశ్చింతగా ఉన్న 10 జనపథ్ కు ఇది మాత్రం మింగుడు పడని విషయమే.పైపెచ్చు తెలంగాణా సెగ , 2G కుంభకోణం అన్నీ కలిసి... రాహుల్ ని 2014 లో భారత ప్రధానిగా చూడాలనుకుంటున్న సోనియా గాంధీ
కల సాకారం అయ్యేలా కనపడట్లేదు.
పాపం.. సోనియా (రాహుల్) ...

0 comments:
Post a Comment