|
కడప లో సానుభూతే పని చేసిందా .... అవునంటున్నారు విశ్లేషకులు ,రాజకీయ నాయకులు .డబ్బు ప్రవాహము,సానుభూతి ,పలుకుబడి తో జగన్ కు రికార్డు మెజారిటీ దక్కడం ఖాయం గా కనపడుతోంది .విజయవాడ కాంగ్రెస్ m p లగడపాటి రాజగోపాల్ సర్వే లో కూడా ఈ విషయం తేటతెల్లం అయింది .
ఇదిలా ఉండగా జగన్ కు 2 లక్షలకంటే ఎక్కువ మెజారిటీ వస్తే తన ఆస్తులు రాసిస్తానన్న మంత్రి డి.ఎల్ అందుకు సిద్ధం గా ఉండాలని వై.యస్.ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు అన్నారు .
ఇదిలా ఉండగా జగన్ ఆగడాలకు హద్దే లేకుండా పోయే అవకాశాలూ లేకపోలేదు ఇదే అదునుగా జగన్ వర్గ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే అవకాశాలు ఉన్నాయి . జగన్ కే.సి.ఆర్ తో కుమ్మక్కై , అవిశ్వాస తీర్మానాన్ని టి.ఆర్.యస్ తో సభ లో ప్రవేశ పెట్టించి తన వర్గ ఏమ్మేల్యేల అండ తో ప్రభుత్వాన్ని బలహీన పరచే దిశగా అడుగులేస్తున్నట్లు సమాచారం. పైకి తండ్రి రెక్కల కష్టం తో ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూలతోయబోను అంటూనే ఆ దిశగా అడుగులేస్తూ సానుభూతిని వాడుకుని గద్దెనెక్కాలని చూస్తున్నారు

0 comments:
Post a Comment