30 April 2011

టీఆర్‌ఎస్‌ బీసీల బాట ! విలీనం లేదు !


kcr-vijayaఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌ ఏ పార్టీలోనూ విలీనం కాబోదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి విలీనం పిచ్చి పట్టిందని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ఆ పార్టీని బంగాళాఖాతంలో విలీనం చేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడిక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగిస్తూ. టీఆర్‌ఎస్‌ పార్టీకి రెండు స్పష్టమైన లక్ష్యాలున్నాయన్నారు. ఒకటి తెలంగాణ రాష్ర్ట్రం సాధించుకోవటం అయితే మరొకటి అణగారిన వర్గాలకు న్యాయం జరిగేందుకు తెలంగాణ పునర్నిర్మాణంలో అన్నారు.

అందులో టీఆర్‌ఎస్‌ పాత్రే ఎక్కువ ఉంటుం దన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీ ఉండి తీరాల్సిందేనని కరాఖండీగా చెప్పారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో అన్నిపార్టీలకు అడ్రస్‌ లేకుండా చేయాలని పార్టీ ప్రతినిధులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పార్టీని పటిష్టం చేసేందుకుగాను వచ్చే నెలలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. పదేళ్ళనాడు పిడికెడు మందితో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ పార్టీ ఈరోజు ఒక సముద్రం ఉప్పెనలా ఉందని చెప్పారు.

తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచే సేది కేవటం టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే అన్నారు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఎన్నోసార్లు ఉద్యమం కోసం పదవులక రాజీనామా చేసిన ఘనత తమ పార్టీ నాయకులదని గుర్తు చేశారు. తెలంగాణ కోసం 600 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ను గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తామని రెండు సార్లు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చిం దని, ప్రధానికి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి ప్రజాస్వామ్యంపై ఏమా త్రం విశ్వాసం ఉన్నా వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

see more in www.Suryaa.com

T.R.S

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us