|
|
కోట్లాది రూపాయలకు అవినీతి వారసుడుగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆ అవినీతి డబ్బుతో గెలవాలని ఆత్రుత పడుతున్నాడని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. బ్రహ్మణి స్టీల్ ప్రారంభానికి నోచుకోక ముందే బ్యాంక్‌లో రుణాల కింద రూ.350 కోట్లు కాజేసి ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు. కడప పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న చంద్రబాబు శుక్రవారం నాడిక్కడ విలేకరులతో కాసేపు ముచ్చటించారు. గాలి సోదరుల సూచనల మేరకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయం నడుపుతున్నాడని ఇందుకోసం ఓబులాపురం గనులు, బ్రాహ్మణి స్టీల్‌లలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి వ్యాపారాల్లో జగన్‌కు భాగస్వామ్యం కల్పించి వెళ్లిపోయారన్నారు.వారి అండదండలతోనే కుంభకోణాలు మొదలు పెట్టారన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తే స్పందించకపోవడంలోనే ఆయన అవినీతి ఎంత అనేది అర్థమైందన్నారు. రాజకీయ మనుగడ కోసం సాక్షి పత్రిక, టీడీ చానెల్ పెట్టి తప్పుడు కథనాలు రాస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. కానీ ప్రజలు అమాయకులు కానే కాదన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం. అటువంటిది 10 శాతం కల్పించేందుకు ముందుకు వస్తే వారివైపు వెళ్లేందుకు అయినా సిద్దం అన్నాడంటే ముస్లింలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో గెలవాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు తిప్పి కొడతారన్నారు. గత రెండు రోజులుగా తాను పర్యటిస్తున్న ముద్దనూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు పట్టణాల్లో ప్రజల నుంచి అత్యధిక స్పందన వచ్చిందన్నారు.
0 comments:
Post a Comment