|
వదినమ్మ విజయమ్మపై పల్లెత్తు మాట అనని వైఎస్సార్ సోదరుడు వై.ఎస్. వివేకానంద రెడ్డి హద్దులు దాటారు. కడప ఉప ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థి వివేకా తన ప్రత్యర్తి వదినమ్మపై విమర్శలు చేశారు. శనివారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి విజయమ్మపై వివేకా వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
తన వదిన విజయమ్మను గెలిపిస్తే ఆమె బెంగళూర్‌లో ఉంటారో, హైదరాబాదులో ఉంటారో తెలియదని, విజయమ్మ ప్రజలకు అందుబాటులో ఉండరని వివేకా చెప్పారు. తనను గెలిపిస్తే ప్రజలకు అన్నివేళలా అందుబాటులోఉంటానని చెప్పారు. విజయమ్మను గెలిపిస్తే ఇంచార్జీలను పెడతారని, ఆ ఇంచార్జీలతో తాము పడలేమని వివేకా వ్యాఖ్యానించారు.

0 comments:
Post a Comment