|
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు కాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. కడప ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులదే విజయమని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. 19 మంది రాష్ట్ర మంత్రు కడపలో మకాం వేసి రాష్ట్ర ప్రజలను మరిచిపోయారని ఆయన అన్నారు.
సంక్షేమ పథకాలను కొనసాగించకపోతే ప్రభుత్వం తిరిగి ఎన్నికలకు వెళ్లాలని ఆయన అన్నారు. సచివాలయానికి పక్షవాతం వచ్చిందని నారాయణ వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను మంత్రులు మరిచిపోయారని, అందువల్ల మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజల విశ్వాసం పొందాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియా ఇంకా కొనసాగుతోందని, మైనింగ్ మాఫియాను ప్రభుత్వం అరికట్టాలని ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

0 comments:
Post a Comment