|
బద్వేలు ఎన్నికల ప్రచారంలో త్వరలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంతేకాకుండా వైఎస్ సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయని ఆరు నెలలకో, సంవత్సరానికో ఎన్నికలు రావడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు.
ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా సాగనంపితే అంత త్వరగా మంచి రోజులు వస్తాయని జగన్ వెల్లడించారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.
ఇంకా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆరునెలలకో, సంవత్సరానికో మధ్యంతర ఎన్నికలు వస్తే వైఎస్సార్ పార్టీని గెలిపించండని జగన్ ఈ సందర్భంగా ఓటర్లను కోరారు.

0 comments:
Post a Comment