|

ముఖ్య మంత్రి కావాలనే స్వార్థంతోనే వైఎస్ జగన్ పార్టీ స్థాపించారని, వైఎస్ సాను భూతి ఓట్లతో పీఠమెక్కాలని కలలు గంటున్నారని సినీతారలు రాజశేఖర్, జీవిత హైదరాబాద్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ పార్టీ నుంచి తాము వైదొలగుతున్నట్లు శుక్రవారం ఉదయం జరిగిన పాత్రికేయుల సమక్షంలో వీరిద్దరూ ప్రకటించారు. తండ్రి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడుస్తోందని ప్రచా రం చేస్తూ..తానొక్కడే ఫోకస్ కావాలని జగన్ అనుకుంటు న్నారని ఈ జంట ఆరోపించింది. ఇతరు లకు గుర్తింపు రాకుండా అడ్డుపడుతున్నా రని, ఆయన పార్టీ నేతలు తమను కావా లనే దూరంగా ఉంచారని ఆవేదనను మీడియా ముఖంగా వ్యక్తం చేశారు. విజయవాడ జగన్ జలదీక్షలో తమకు వచ్చిన స్పందన చూసి జగన్ అసూయపడ్డారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై కామెంట్ చేయడానికి వారు నిరాకరించారు.
see more in www.Suryaa.com
see more in www.Suryaa.com

0 comments:
Post a Comment