తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరలో కాంగ్రెస్‌పార్టీలోకి వచ్చేస్తారని, అంతకు మించి ఆయనకు గత్యంతరం లేదని ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున శుక్రవారం కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో చిరంజీవి రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. తన రక్తంలో ఇప్పటికీ ముపె్పై శాతం కాంగ్రెస్ రక్తం ఉందని చెప్పుకుం టున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎన్‌టిఆర్ వారసుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని, చంద్ర బాబుకు ఆ పార్టీలో ఉండే పరిస్థితులు ఉండవని దాంతో సొంత గూటికి (కాంగ్రెస్‌లోకి) రావాల్సివుంటుందని చిరంజీవి అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని చిరంజీవి ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి అంతిమ సంస్కారం కాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ ప్రాకులాడారని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కేం దుకు తన మద్దతు కోరుతూ ఎమ్మెల్యేలను జగన్ తన వద్దకు పంపారని ఆరోపించారు. ఆయన అధికార దా హం వల్లనే ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. బిజెపితో జత కలిసేందుకు సిద్ధంగా ఉన్న జగన్‌కు ఓట్లు వేయవద్దని ముస్లింలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఎవరైనా ముస్లింలు ఉంటే ఇప్పటికైనా ఆలోచించు కొని వెనుక్కురావాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అహంకా రానికి, సోనియాగాంధీ ఆత్మభిమానానికి మధ్య ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తనపై అభిమానాలకు ప్రజలకు ఉన్న ప్రేమను కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేస్తున్న డిఎల్ రవీంద్రారెడ్డికి ఓట్ల రూపంలో బహుమతిగా ఇవ్వండని ఆయన కోరారు. కాంగ్రెస్‌పార్టీని కాదనుకుంటే మనల్ని మనం అవమానించుకున్నట్లేనని చిరంజీవి చెప్పారు. చిరు రోడ్ షో విజయవంతమైంది. పులివెందుల రోడ్ షోలో చిరంజీవి మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసిరారు.
0 comments:
Post a Comment