|

జగన్ అంతిమ గమ్యం కాంగ్రెస్సే అవుతుందని అటు కాంగ్రెస్ వర్గాలు, ఇటు ప్రతిపక్షాలు కోడై కూస్తున్న దశలో జగనే స్వయంగా ఈ ప్రకటన చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కడప ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన ఇప్పటికే కొన్ని వివాదాస్పద ప్రకటనలు చేసి ఇరకాటంలో పడ్డారు. అవి సృష్టించిన రాజకీయ దుమారం నుంచి తమ నేతను బైటికి లాగేందుకు ఆయన అనుయాయులు ఇప్పటికే రకరకాల నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. జగన్ బీజేపీతో చేతులు కలపడం ఖాయమని ఆది నుంచి ఒక ఊహాగానం బయలుదేరింది. దాన్ని జగన్ కరాకండీగా ఖండించకపోగా రెండు రోజుల క్రితం ఆయన సంచలన ప్రకటన చేశారు. ముస్లిములకు బీజేపీ పది శాతం రిజర్వేషన్లు ఇస్తే బీజేపీతో చేతులు కలపడానికి తనకు అభ్యంతరం లేదని ప్రచారపర్వంలో చెప్పారు.
ఇది కడపలోని ముస్లిములను దిగ్భ్రాంతికి గురి చేసింది. తీరా జరిగిన నష్టాన్ని గ్రహించి జగన్ నాలుక కరుచుకునే ప్రయత్నం చేశారు. బీజేపీలో చేరడానికి తాను సుముఖమని తన ఉద్దేశం కాదని, బీజేపీ ముస్లిములకు అంతటి రిజర్వేషన్లు ఇవ్వదు కాబట్టి, తాను బీజేపీలో చేరడం అసాధ్యమని చెప్పడం తన ఉద్దేశమని జగన్ ఎంతగా వివరణ ఇచ్చుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనికి తోడు బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు చేసిన ప్రకటన అగ్నికి అజ్యం పోసినట్లయి, జగన్‌కు మరింత రాజకీయ నష్టం కలిగించింది. ముస్లిములకు తమ పార్టీ ఒక్క శాతం కూడా రిజర్వేషన్లు కల్పించబోదని వెంకయ్య నాయుడు ప్రకటించి, జగన్‌ను రెండింటికి చెడ్డ రేవడిలా చేశారు.
see more in www.Suryaa.com

0 comments:
Post a Comment