|
జగన్ ఏనాటికి ముఖ్యమంత్రి కాలేడని, అవినీతి సొమ్ముకు మాత్రమే ఆయన వారసుడని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప పార్లమెంట్, పులివెందుల ఉప ఎన్నిల ప్రచారంలో భాగంగా గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సంద ర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ధరలు పెరిగిపోయి తిండితినలేని పరిస్థితుల్లొ ప్రజలున్నారన్నారు. అంతేగాక రైతులకు గిట్టుబాటు దరలు లేక అల్లాడి పొతున్నా పట్టించుకోని పరిస్దితిలో కాంగ్రెస్ నాయకులున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాడికి వ్యతి రేకంగా పాలన అందిస్తున్నాయన్నారు. 2జీ స్ప్రేక్ట్రమ్ స్కామ్‌లొ 1.75 లక్షల కోట్లు స్వాహ చేశార న్నారు
అంతేగాక కామన్‌వెల్త్ గేమ్స్‌లో కొట్లాది రూపాయలు దొచు కున్నారన్నారు. బ్రహ్మణీ స్టీల్ నిర్మి స్తామని 14 వేల ఎకరాలు కేవలం 80 కోట్లకు ఇస్తే, ఆ భూములు కాస్తా 350 కోట్లకు అమ్ముకో జూశారని అన్నారు. అలాగే 3 వేల ఎకరాల్లొ ఓబుళాపురం గనులు త్ర వ్వుకొని 15 వేల కోట్లు ఐరన్ ఓర్ ఇతర దేశాలకు అమ్ముకు న్నారని అరోపించారు. రాష్ట్రంలొని భూగర్బ, ఖనిజాలను యథేచ్ఛగా దొచుకున్నారన్నారు. జలయజ్ఞాన్ని కాస్త్తా ధనయజ్ఞంగా మార్చా రన్నారు. సామాజిక న్యాయం అంటు ప్రజ ల్ల్లోకి ఓ సినిమా యాక్టర్ వచ్చి అంతలోపే ప్రజారాజ్యం జెండా పీకేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన స్వలాభం కోసం వారి పంచన చేరాడన్నారు. అంతేగాక ఆయన ప్రజలకు ఏమి సేవ చేస్తాడొ అర్ధం కాని పరిస్థితి అంటు ఎద్దేవా చేశారు. చేనేతల కోసం రూ.312 కోట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ వారిని నట్టేట ముంచిందన్నారు. ఈ ఉపఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం తధ్యమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలొ మాజీ మంత్రి పి.రామ సుబ్బారెడ్డి, పార్లమెంట్ అభ్యర్ది మైసూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు

0 comments:
Post a Comment