|
శ్రీలంక క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ సర్వసాధారణంగా మారిపోయిందని శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హసన్ తిలకరత్నే సంచలన వ్యాఖ్యలు చేశాడు. చాలా కాలంగా తమ దేశ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చాలా ఈజీగా మారిందని, ఫిక్సింగ్‌కు బ్రేక్ వేయకపోతే పాకిస్థాన్‌లా పరిస్థితి మారిపోతుందని తిలకరత్నే వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ ఫిక్సింగ్‌పై శుక్రవారం మీడియాతో మాట్లాడిన తిలకరత్నే దిల్షాన్.. ప్రపంచ కప్ పోటీల పైనల్ మ్యాచుకు నలుగురు క్రికెటర్లను ఎందుకు మార్చారని ప్రశ్నించాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌ను నిరోధించకపోతే తమ దేశ క్రికెట్ కూడా పాకిస్తాన్ క్రికెట్‌లా తయారవుతుందన్నాడు. శ్రీలంకలో 1992 నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని, ఇందుకు సంబంధించిన పేర్లను తాను వెల్లడిస్తానని తిలకరత్నే ప్రకటించాడు.
డబ్బులు ముట్టజెప్పడం ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ సంఘటనలు బయటకు రాకుండా చూశారన్నారు. ఎవరో ఒక్కరు జోక్యం చేసుకుని ఈ మ్యాచ్ ఫిక్సింగ్ భూతాన్ని అరికట్టకపోతే రెండు మూడేళ్లలో ఈ దేశం రాజకీయాలతో, అవినీతి యంత్రాంగంతో మరో పాకిస్థాన్ కావడం ఖాయమని ఆయన అన్నారు.

0 comments:
Post a Comment