|
రాష్ట్రంలో రౌడీ రాజకీయాలకు కడప పుట్టినిల్లు అని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఆయన కడప ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ సభ్యులకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
వైఎస్.జగన్మోహన్ రెడ్డి కడప, పులివెందుల ఫ్యాక్షన్ పాలిటిక్స్‌ను నడుపుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా, కడప, పులివెందులలో రౌడీల రాజ్యం నడుస్తోందన్నారు. ఓటర్లు స్వతంత్రగా తమ ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకోలేక పోతున్నారని విమర్శించారు. రౌడీ రాజకీయాల కారణంగా ఓటర్లు భయంతో ఓటు వేయడానికి కూడా రాలేక పోతున్నారని అన్నారు.

భవిష్యత్‌లో భారతీయ జనతా పార్టీతో జగన్ పొత్తు పెట్టుకోవడం ఖాయమన్నారు. ఇందుకోసం కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగమే కడప, పులివెందులలో భాజపా పోటీ చేయలేదని ఆరోపించారు. కడప జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు

0 comments:
Post a Comment