29 April 2011

కాంగ్రెస్ నేతలకు సిగ్గూఎగ్గూ లేదు: వైఎస్.జగన్మోహన్


కాంగ్రెస్ పార్టీ నేతలకు సిగ్గూ ఎగ్గూ లేకుండా తనపై రోజుకొకటి చొప్పున ఆరోపణ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు సిగ్గు లేకుండా తనపై రోజుకో అభాండం వేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ ఆరోపణలు చేసే నేతలు దమ్ముంటే ఒక్కదాన్నైనా నిరూపించగలరా అని జగన్ సవాల్ విసిరారు. తనపై కక్షకట్టి తనను రాజకీయంగా అణగదొక్కేందుకు కాంగ్రెస్-తెదేపాలు చేతులు కలిపాయన్నారు. దీనివల్ల ఆ పార్టీలకు ఎంతమేరకు ప్రయోజనం ఉందోలేదో తెలియదు గానీ, ప్రజలను మాత్రం మోసం చేసేందుకు సిద్ధమయ్యాయన్నారు.
ఇకపోతే.. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను, తన తల్లి విజయమ్మను ఓడించేందుకు కాంగ్రెస్ మంత్రులు డబ్బు సంచులతో గ్రామగ్రామంలో తిరుగుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వారికి ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని ఆయన పిలుపునిచ్చారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూమి లేని ప్రతి పేదవానికి భూమిని కేటాయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తామన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా వ్యవసాయం సాగు చేసుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు

Y.S.Jagan, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us