|
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి తెలంగాణా రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్న పోచారం శ్రీనివాస రెడ్డి జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి నచ్చకే ఆ పార్టీని వదిలిపెట్టేశానని చెప్పుకొచ్చారు.
తానే కాదు... త్వరలో నాగం జనార్థన్ రెడ్డి కూడా గులాబీ రంగు కండువా వేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణా సాధనకోసం పనిచేసేవారు ఆ పార్టీలో ఉండలేరని అన్నారు.
తెలంగాణా ప్రజలు పచ్చ జెండా పార్టీని ఇంటికి పంపించే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదని చెప్పారు. తెలంగాణా ప్రాంతంలో ఆ పార్టీ కనుమరుగు కాక తప్పదన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పని చేసేవారికే వారి హృదయాల్లో స్థానముంటుందన్నారు.
నాలుగు కోట్లమంది తెలంగాణా ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం పార్టీ పుట్టగతులు ఉండవని అన్నారు. త్వరలో తాము చేపట్టబోయే సభలో అశేష జనవాహిని తరలి వస్తుందనీ, ఆ సమూహాన్ని చూసి తెలుగుదేశం పార్టీ జడుసుకోవడం ఖాయమనీ అన్నారు.

0 comments:
Post a Comment