|
మాట తప్పను, మడమ తిప్పను అని చెబుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ అందుకు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. తల్లిమీద, పెరిగిన వ్యవస్థ మీద కూడా జగన్‌కు గౌరవం లేదన్నారు. ఉప ఎన్నికల తర్వాత ఏదో జరిగి పోతుందని అందరూ అనుకుంటున్నారని అయితే జగన్ రాజీనామా చేసి ఆరునెలలు అవుతుందని ఇన్నాళ్లు ఏమీ జరగనిది ఇప్పుడు ఏమవుతుందని ప్రశ్నించారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని కన్నా జోస్యం చెప్పారు. దేశ రాజకీయాలు మారుస్తానని జగన్ అనడం తెలివితక్కువతనమేని కన్నా వ్యాఖ్యానించారు. పులివెందుల, కడప ఉప ఎన్నికలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు మధ్య జరుగుతున్న పోటీగా మంత్రి పేర్కొన్నారు.
వైయస్ ఎప్పుడూ కాంగ్రెసును వ్యతిరేకించలేదన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ కుటుంబం పట్ల విశ్వసనీయత కలిగి వైయస్ ఉండేవారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లి సోనియాను విమర్శించడం ద్వారా తండ్రిని ఆత్మకు మానసిక క్షోభను కలిగిస్తున్నారని అన్నారు.

0 comments:
Post a Comment