|
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఏజెంట్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ అంశంపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తాను భాజపాకు మద్దతు ఇచ్చే విషయంలో తన మనసులో మాటను ఎన్నికల ప్రచారంలో వెల్లడించారన్నారు.
కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి, వైఎస్.జగన్‌కు సంబంధాలు ఉన్నాయన్నారు. ఎన్‌డీఏకు మద్దతు ఇచ్చే దిశగా చర్చలు జరిగాయన్నారు. మతతత్వాన్ని వీడి దేశంలోని ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని భాజపా హామీ ఇస్తే ఆ పార్టీ మద్దతు ఇస్తామని జగన్ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారన్నారు.
ఈ వ్యాఖ్యలు ఆయన మనస్సులోని మాటకు సమానమన్నారు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిన జగన్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్‌పై చర్య తీసుకొనేందుకు సోనియా కూడా వెనుకాడుతుందని, అందుకు కారణం జగన్ ఎన్‌డీఏ వైపు వెళ్లి తమ గుట్టు రట్టు చేస్తాడన్న భయంతోనే అని ఆరోపించారు.

0 comments:
Post a Comment