|
కడప, పులివెందుల ఉప ఎన్నికల నేపధ్యంలో పీఆర్పీ అధినేత చిరంజీవి కడపలో పర్యటిస్తున్నారు. తండ్రి అంత్యక్రియలు పూర్తికాకుండానే తనకు మద్దతివ్వాలని జగన్ ఎమ్మెల్యేలను నా దగ్గరకు పంపాడని చిరంజీవి ఆరోపించారు. వైఎస్ జగన్‌పై ఆయన మండిపడ్డారు. జగన్ అధికార దాహంతో ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. ఇది రాజరికం కాదు.. ప్రజాస్వామ్యం అన్నారు. రాజకీయ వారసత్వాలకు తావులేదని చిరంజీవి అన్నారు. కడప జిల్లాలో ప్రచారంలో చిరంజీవి మాట్లాడుతూ ఉప ఎన్నికలు సోనియా అభిమానానికి, జగన్ అహంకారానికి మధ్య జరిగే ఎన్నికలుగా చిరంజీవి అభివర్ణించారు

0 comments:
Post a Comment