
కడప ఉప ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలను నీతి, అవినీతి మధ్య జరుగుతున్న పోరుగా బాబు అభివర్ణించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీని గెలిపించుకుంటామని బాబు అన్నారు. ఉప ఎన్నికల అభ్యర్థుల పేర్లను బాబు ప్రకటించారు. పులివెందుల అసెంబ్లీకి బీటెక్ రవి, కడప లోకసభ స్థానానికి మైసూరారెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు బాబు వెల్లడించారు
Tagged as : Chandrababu
T.D.P
0 comments:
Post a Comment