|
తెరాస కార్యవర్గ సమావేశం బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ తెరాస పార్టీ దశాబ్ది, తెలంగాణ ఉద్యమ శతాబ్ది ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్‌ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
ఇందుకోసం హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్‌ను అనమతి ఇవ్వాలని కోరారు. ఇక్కడ బహిరంగ సభ ఇవ్వక పోతే 27వ తేదీన మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగసభను నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 14 తేది నుంచి పది రోజుల పాటు తెలంగాణ ఉద్యమ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. పదకొండవ రోజున జిల్లా కేంద్రాలలో తెలంగాణ జాతర నిర్వహిస్తామన్నారు.
- ఈ సందర్భంగా విశ్వవిజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యులను అభినందిస్తూ ఒక తీర్మానం చేశారు. అలాగే, ఇటీవల హత్యకు గురైన తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు సాంబశివుడు హత్యకు రెండు నిమిషాలు మౌనం పాటించినట్టు ఆయన తెలిపారు.

0 comments:
Post a Comment