|
కడప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేలస్తే కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి ఓటు వేసినట్లేనని కాంగ్రెసు శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాలి జనార్ధన్ రెడ్డి-వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇరువురూ అక్రమ సంపాదనను రక్షించుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారని పొంగులేటి అన్నారు.
కడప పార్లమెంటులో జగన్‌కు ఓటు వేసినా, పులివెందుల అసెంబ్లీ నుండి విజయమ్మకు ఓటు వేసినా కర్ణాటక బీజేపీలో ఉన్న గాలికి ఓటు వేసినట్లేనని ఆయన తెలిపారు. ఉప ఎన్నికల తర్వాత జగన్ భారతీయ జనతా పార్టీతో కలవడం ఖాయమని పొంగులేటి జోస్యం చెప్పారు. పదవి కోసం జగన్మోహన్ రెడ్డి పాకులాడటం వల్లే ఉపఎన్నికలు వచ్చాయని ఆయన చెప్పారు.

0 comments:
Post a Comment