|
మాజీ పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పరిధిని మించి విమర్శలు చేస్తున్నారని రాయపాటి అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పదవులు త్యాగం చేస్తే, జగన్ పదవి కోసం పాకులాడుతున్నారని రాయపాటి మీడియా ప్రతినిధుల సమావేశంలో ధ్వజమెత్తారు.
కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ సోనియాకు, వైయస్సార్‌కు మధ్యనే జగన్ అనడం మూర్ఖత్వమని రాయపాటి వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా తమ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని రాయపాటి అన్నారు

0 comments:
Post a Comment