|
కేవలం ఓటర్లను తికమకపెట్టే ప్రయోగాలు చేయాల్సిన ఆగత్యం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్దంగా ఎవరైనా భారతదేశంలో చట్టసభలకు సంబంధించి అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు అర్హులన్న విషయాన్ని జగన్ గుర్తుకు పెట్టుకుంటే మంచిదన్నారు.
పదేపదే ఆత్మగౌరవం గురించి మాట్లాడే జగన్‌మోహన్‌రెడ్డి తన బాబాయ్‌కి మంత్రి పదవి ఇస్తే ఆత్మగౌరవానికి భంగం కలిగినట్లు జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల తరువాత వైయస్ జగన్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని తులసిరెడ్డి జోస్యం చెప్పారు.
ఇప్పటికైనా వైయస్ జగన్ తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో ఎన్నికల ప్రచారంలో మాట్లాడేటప్పు డు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన జగన్‌కు హితవు పలికారు.

0 comments:
Post a Comment