తెలంగాణ కోసం ఒంటరిగానైనా పోరాడతానని టీడీపీ సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ నా జన్మహక్కు ఆయన అన్నారు. నేను ఎక్కడా చంద్రబాబు పేరును ప్రస్తావించలేదు. నేను ఏ తప్పూ చేయలేదని నాగం అన్నారు. నాపై అసత్య ప్రచారానికి కుట్ర జరుగుతోందని నాగం ఆరోపించారు. పార్టీలో కొంతమంది దుర్మార్గులున్నారు. వారితోనే పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాల్సిన బాధ్యత పార్టీకుందని ఆయన గుర్తుచేశారు. పార్టీ వైఖరి స్పష్టంగా లేకపోవడం తనకు బాధ కలిగించిందని నాగం స్పష్టం చేశారు.
courtesy www.Suryaa.com
0 comments:
Post a Comment