18 April 2011

ఎర్రబెల్లి ఓ బ్రోకర్‌ :కేటీఆర్‌

Ktr-pcతాను బచ్చాగాడు అన్న టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లిపై కేటీఆర్‌ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఉద్యమంలో అనుభం కన్నా నమ్మకం ముఖ్యమన్నారు. ఎర్రబెల్లి చంద్రబాబునాయుడు బ్రోకర్‌లా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో చిల్లర నేతలు ఉన్నారన్న నాగం వ్యాఖ్యలు ఎర్రబెల్లిని చూస్తే నిజమే అనిపిస్తుందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు శ్రవణ్‌ దాసోజు, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు తులఉమ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు సుమన్‌లతో లిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలోని అంశాలను అమలు చేయమని చంద్రబాబును నాగం అడిగితే ఆయనపై పిచ్చికుక్కల్లా మాటల దాడి చేస్తూ ఆయనకు షోకాజు నోటీసు ఇవ్వాలని తెలంగాణ టీడీపీ నాయకులు డిమాండ్‌ చేయటం సిగ్గుచేటన్నారు. ఎకరం భూమిలేని కేసీఆర్‌ కుటుంబానికి వేల ఎకరాలు ఎలా వచ్చాయన్న ఎర్రబెల్లి వ్యాఖ్యలను కొట్టిపారేశారు. వేల ఎకరాలు ఉంటే ఆయనకే రాసిస్తా.. అంటూ మండిపడ్డారు. గతంలో తమ పార్టీ నేతలు ప్రకటించినట్లు 1975 నుండి కేసీఆర్‌ ఆస్తులపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు అందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు.

see more in www.suryaa.com

T.R.S

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us