|
అసమర్థుడని తెలిసినప్పటికీ తన తనయుడు లోకేష్‌కు టిడిపి పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని, అందుకే నందమూరి కుటుంబసభ్యులు తిరగబడుతున్నారని ఎన్‌టిఆర్ టిడిపి అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎన్‌టిఆర్ నుండి అక్రమంగా లాక్కున్న చంద్రబాబు తన కుమారుడు అసమర్థుడైనప్పటికీ అతని చేతికి పగ్గాలు అందించేందుకు ఉత్సాహపడుతున్నారన్నారు. దీన్ని గుర్తించడంతోనే నందమూరి కుటుంబీకులు చంద్రబాబుపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారన్నారు. చంద్రబాబు కుట్రలను నందమూరి కుమారులు తెలుసుకుని పార్టీని కాపాడుకుంటారన్న నమ్మకం తనకుందన్నారు.సంపాదించిన నల్లధనాన్ని దాచుకునేందుకు ఇటీవల సింగపూర్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లి వచ్చాడన్నారు. ఇటువంటి అవినీతిపరుడైన చంద్రబాబు అన్నా హజారేకి మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా వుందన్నారు. ఎన్‌టిఆర్, వైఎస్‌ఆర్ ఆశయాలను పాటిస్తూ ప్రతిరూపంగా జగన్ తన పరిపాలన సాగించనున్నారన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించనుందన్నారు
www.Andhra Bhoomi.net
www.Andhra Bhoomi.net

0 comments:
Post a Comment