|
సోనియాకు నామినే టెడ్ నాయకులు అవసరమని, ప్రజల మద్దతు ఉన్న నాయకులు అవసరం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు అన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సీమస్థాయి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్‌సెల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి హీనులుగా ఉన్న నేతలను ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా కాం గ్రెస్ పార్టీ నియమించినందునే కాంగ్రెస్ మనుగడ కోల్పోతుందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఏడు సంవత్సరాలు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా కాకుండా పరీక్ష పద్ధతిలో ఎన్నికై సోనియాచే ప్రతిపాదించబడిన వారు భారత ప్రధానిగా అసమర్థపాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రజల నుంచి వచ్చి న నాయకులు ఇద్దరే అని ఒకరు ఎన్‌టిఆర్, మరొకరు వైఎస్‌ఆర్ అని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టు రామచం ద్రారావు, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. courtesy
www.Suryaa.com
www.Suryaa.com

0 comments:
Post a Comment