|
ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తన సొంత రాష్ట్రం అసోంలో నిర్వహించిన ఎన్నికల్లో ఓటు వేయక పోవడం ప్రధాని బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల ధ్వజమెత్తారు. మంగళవారం నాడిక్కడ ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మాట్లాడారు. దేశానికి ప్రధాని అయితే తన ఓటు హక్కును వినియోగించుకోరా? అని ప్రశ్నించారు. ప్రధానిగా దైనందిన జీవితంలో నిజంగానే బిజీగా ఉండిఉంటే పోస్టల్ బ్యాలెట్‌నైనా ఉపయోగించుకోవాల్సిందన్నారు. ఓటు వేయక పోవడం మన్మోహన్‌కు ఇదేం తొలి సారి కాదని, 2006 ఎన్నికల్లోనూ ఆయన ఓటు వేయలేదని ఆరోపించారు.
ఓటు వేయని ప్రధాని మన్మోహన్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లేయాలంటూ ఎలా అభ్యర్థిస్తారని సుధీష్ రాంభొట్ల ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది వంటిదన్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రధాని ఓటు హక్కు వినియోగించుకోక పోవడంపై ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉందంటే అందుకు కారణం ఓటు హక్కేనన్నారు. ఓటు కూడా వేయలేని మన్మోహన్ సింగ్‌కు ప్రధానిగా దేశాన్ని పాలించే హక్కే లేదన్నారు. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం లాంటి దేశాల్లో ఓటు హక్కు వినియెగాన్ని తప్పని సరి చేస్తుంటే మన దేశంలో సాక్షాత్తూ ప్రధానే ఓటు హక్కును వినియోగించుకోలేని దుస్థితిలో మనం ఉన్నామన్నారు.
courtesy www.Suryaa.com

0 comments:
Post a Comment