|
ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నాహజారే ప్రశంసను తాను స్వీకరిస్తున్నానని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అంగీకరించారు. ‘నా పనితీరును అన్నా హజారె అభినందించటం ఆనందంగా ఉంది. ఆయన ప్రోత్సాహం నాకు మరింత ప్రేరణను ఇచ్చింది.’ అని జనతా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న నితీశ్ తెలిపారు.సమాజంలోని సమస్యలను పరిష్కరించటంలో ప్రజాధికారులు పూర్తిగా విఫలమైతే రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇప్పుడిప్పుడే ఎదుగుతుందన్నారు. ఇటీవలే రాష్ట్రంలోని ఉభయసభల్లో రైట్ టు రికాల్ బిల్లును ప్రవేశపెట్టామన్నారు. ప్రజాప్రతినిధులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే రైటు టు రికాల్ బిల్లు ద్వారా వారిని తొలగించే హక్కు ఉంటుంది. దీని వల్ల సమాజపరిపాలనలో పారదర్శకత ఏర్పడుతుందన్నారు. బీహార్‌లో రైట్ టు సర్వీస్ చట్టం ఏర్పాటు అవినీతికి అడ్డుకట్ట వేస్తుందన్నారు. దీన్ని ఆగష్టు 15 నుంచి అమలుచేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
courtesy www.Suryaa.com
courtesy www.Suryaa.com

0 comments:
Post a Comment