|
కడప ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు ఏవని బిజెపి సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగరరావు ప్రశ్నించారు. లక్షలాది రూపాయిల నగదు ఇటీవల అధికారులకు దొరికిందని, ఆ డబ్బు ఎవరిదో ఇంతవరకూ అధికారులు చెప్పడం లేదని అన్నారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కడప ఉప ఎన్నికల సందర్భంగా చట్ట వ్యతిరేక, నేరపూరిత ప్రసంగాలను చేస్తున్నా అధికారులు ఎందుకు వౌనంగా ఉన్నారని అన్నారు. ఆధిపత్యపోరునకు అంతిమతీర్పులా కడప ఉప ఎన్నికలను భావిస్తున్నారని అన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారెవరో పోలింగ్‌కు ముందే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిటాల రవీంద్ర హత్యలో జగన్ ప్రమేయం ఉందని రాష్ట్ర మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చెబుతున్నారని, మంత్రి చెప్పడం అంటే అది ప్రభుత్వం చెప్పినట్టే అవుతుందని, ఈ ప్రకటనపై కేసులు నమోదు చేసి బాధ్యులను విచారించాలని అన్నారు. ఇటువంటి ప్రకటనలను ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. కడప ఉప ఎన్నికలు ప్రశాంతగా, నిజాయితీగా జరగాల్సి ఉందని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలోని 8వ చాప్టర్‌ను బహిర్గత పర్చాలని హైకోర్టు ఆదేశించినా కేంద్రం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిందని, తక్షణం నివేదికను వెల్లడించాలని విద్యాసాగరరావు సూచించారు. నివేదికలోని చాలా విషయాలు బయటకు వచ్చినా, వాస్తవంగా ఏ ముందో తెలియాలంటే నివేదిక వెలుగు చూడాలి.see more in
www.Andhra Bhoomi.net
www.Andhra Bhoomi.net

0 comments:
Post a Comment