|
కడపలో పది మంది మంత్రులు మోహరించడంతో ఆయా శాఖల యంత్రాంగం పని చేయడం లేదని, పాలన కోమాలోకి వెళ్లిందని సిపిఐ రాష్టక్రార్యదర్శి డాక్టర్ కె. నారాయణ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి కడప ఉపఎన్నిక మినహా ఇంకేమీ పట్టడం లేదని పేర్కొన్నారు. మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు కుక్కల్లా కడప వీధుల్లో తిరుగుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును అందరూ శిరసావహించాలని, కడపలో జగన్, పులివెందులలో విజయలక్ష్మి గెలిస్తే కొంపలేమీ మునిగిపోవని, ఫలితాలను క్రీడాస్పూర్తితో స్వీకరించాలని అన్నారు. ఎన్నికల్లో రాజకీయ ప్రచారం చేయడమే పార్టీల కర్తవ్యం కావాలని, అందుకు మించి ఏదైనా చేస్తే భంగపాటు తప్పదని హెచ్చరించారు. కడపలో టిడిపి తరఫున ప్రచారం చేస్తామని, చంద్రబాబు-హరికృష్ణల మధ్య వ్యవహారం కుటుంబ వ్యవహారమేనని, అవి సర్దుకుపోతాయని చెప్పారు. వాటిద్వారా రాజకీయ సంక్షోభం వస్తుందని తాను భావించడం లేదని అన్నారు.
see more in www.Andhra Bhoomi.net
see more in www.Andhra Bhoomi.net

0 comments:
Post a Comment