|
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోమోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి కావాలనే తపన ఉన్నప్పుడు లోక్‌సభకు పోటీచేయడం ఎందుకని కడప కాంగ్రెస్ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. పోటీ నుంచి విరమించే విషయంపై ఆయన ఆలోచిస్తే మంచిదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ఖాజీపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలనే జగన్ పార్టీ స్థాపించాడన్నారు. అందువల్ల లోక్‌సభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని డిఎల్ సూచించారు. ఆస్తిపాస్తులను కాపాడుకోవడానికి తపనపడుతూ కడప - ఢిల్లీ మధ్య పోటీ అని చెప్పుకోవడంలో ఏమాత్రం అర్థం లేదన్నారు. అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు కూడగట్టిన జగన్ ప్రజల కోసం ఏనాడు పాటు పడలేదని ఆరోపించారు. న్యాయం, ధర్మం, విశ్వసనీయత, అధికారం, అహంకారం తదితర విషయాలను జగన్ ప్రస్తావించడం సబబు కాదన్నారు. తాను 1978లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలచినట్లు రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గం ప్రజల దయాదాక్షిణ్యాలపై లుస్తున్నానే తప్ప ఏ ఒక్కరి వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి తనకు మంచి మిత్రులను, తమ మధ్య సత్సంబంధాలు ఉండేవన్నారు. అయితే వైఎస్‌ను చూసి ప్రజలు తనకు ఓట్లు వేయలేదని ఆయన అన్నారు.
ఈ ఎన్నికల్లో సైతం ప్రజలు తనను అదేవిధంగా ఆదరిస్తారని డిఎల్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ మంచివేనని, తాను ఆ పథకాలను ఎప్పుడూ తప్పుపట్టలేదన్నారు. ఆర్థిక వనరులపై ప్రశ్నించానే తప్ప వైఎస్‌పై తనకు ఎటువంటి ద్వేషం లేదన్నారు. దీన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు
www.AndhraBhoomi.net

0 comments:
Post a Comment