|
తీవ్రవాదుల కన్నా ప్రమాదకరమైన వ్యక్తి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం కడప జిల్లా మైదుకూరు జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన డిఎల్ జగన్‌పై నిప్పులుచెరిగారు. జగన్‌కు క్రిమినల్ చరిత్ర కూడా ఉందన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళిల ప్రత్యర్థి ప్రభాకర్‌రెడ్డిని హత్య చేయించింది జగనేనని అన్నారు. కడప నుంచి తన అనుచరులను పంపి ప్రభాకర్‌రెడ్డిని మట్టుబెట్టించింది జగనేనని ధ్వజమెత్తారు. సురేఖ జగన్ ఆశ్రయించడం వల్లే ప్రభాకర్‌రెడ్డి హత్య జరిగిందన్నారు. ప్రత్యర్థి పీడ విరిగిందని కొండా దంపతులు సంబర పడుతున్నారని, దీనికి కారణం జగనేనన్నారు. జగన్ క్రిమినల్ చర్యల గురించి, ఆయన అక్రమాల గురించి సురేఖకు ఏమి తెలుసని ప్రశ్నించారు. జగన్‌ను చిన్నప్పటినుంచి తాను, కడప జిల్లా వాసులు ఎరుగుదురన్నారు. అటువంటి క్రిమినల్, అవినీతి పరునికి ప్రజలు ఓట్లు వేస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టేనన్నారు.
courtesywww.Andhra Bhoomi.net
courtesywww.Andhra Bhoomi.net

0 comments:
Post a Comment