|
వైఎస్ జగన్‌పై ముప్పేట దాడికి తెలుగుదేశం సిద్ధమైంది. ఆ పార్టీ రాష్టన్రాయకులు జిల్లాలో మకాం వేసి జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. టిడిపి అభ్యర్థి మైసూరా రెడ్డి, యనమల రామకృష్ణుడు, ఎర్రంనాయుడు, రేవంత్‌రెడ్డి ప్రొద్దుటూరులోని ఎమ్మెల్యే లింగారెడ్డి స్వగృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా విజయమ్మను, ఎంపిగా జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఎన్నుకుంటే అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయలేదని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో వారికి మళ్లీ ఓట్లు వేసి గెలిపించినా పరిస్ధితి అదే విధంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఓడించే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని వారు అభిప్రాయపడ్డారు. జగన్ సోనియాను ఢీ కొడతాననడం సమంజసం కాదని, ఎవరికోసం, ఎందుకోసం ఢీ కొట్టాలో తెలపాలన్నారు. మైసూరారెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికలు నీతి, అవినీతికి మధ్య జరుగుతున్నాయన్నారు. అవినీతి సొమ్ములో వాటా కోరవచ్చుగానీ తండ్రి పదవి తనకు కావాలని జగన్ కోరడం సబబు కాదన్నారు. కాగా తండ్రి శవాన్ని పక్కనపెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించిన ఘనత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికే దక్కిందని, పదవి ఇవ్వలేదని సొంత పార్టీ పెట్టిన జగన్ తిరిగి కాంగ్రెస్‌లో చేరతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేతలు గాలి ముద్దుకృష్ణనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోపించారు. కడపలో విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ పదవుల కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాంగ్రెస్, జగన్ ఖర్చుపెట్టిస్తున్నారని ఆరోపించారు. రాజశేఖర్‌రెడ్డి శవం ఇంటికి చేరకమునుపే ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలని జగన్ ఆశపడ్డారన్నారు. పదవుల కోసం జగన్, ఆయన తల్లి విజయమ్మ రాజీనామా చేశారన్నారు. ప్రజలకు వీరు సమాధానం చెప్పితీరాల్సిందేనన్నారు. ప్రజల సొమ్మును ఇలా ఖర్చు చేయించడంలో కాంగ్రెస్ పార్టీకి కూడా బాధ్యత ఉందన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలన్న ఆకాంక్షతోనే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసేందుకు పూనుకున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రంలో ఆరేళ్ల పాటు పాలన సాగించిన రాజశేఖర్‌రెడ్డి లక్ష కోట్ల రూపాయలు దండుకున్నారని ఈ వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి 50 వేల కోట్ల రూపాయలు ఇచ్చారని వారు ధ్వజమెత్తారు.
www.Andhra Bhoomi.net
www.Andhra Bhoomi.net

0 comments:
Post a Comment