|
ఏకాభిప్రాయ సాధనతో అవినీతిని రూపుమాపగల పటిష్టవంతమైన లోక్‌పాల్ బిల్లును రూపొందించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి, యుపీఏ ప్రభుత్వానికి ఏ కోశానా లేదని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. బిల్లు ముసాయిదాను ఖరారు చేయటానికి ఏర్పడిన కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాకముందే కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న మంత్రులు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్ చేస్తున్న ప్రకటనలు సంఘర్షణకు దారి తీసేట్లున్నాయే తప్పించి ఏకాభిప్రాయ సాధనకు దోహదపడేటట్లు లేవని పార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ చెప్పారు. లోక్‌పాల్ బిల్లుంటేనే దేశంలో 70కోట్ల మందికి సెల్ ఫోన్లు వచ్చాయా? లోక్‌పాల్ బిల్లు లేనంతమాత్రాన నిరుపేదల పిల్లలు బడికి వెళ్లి చదువుకోవటం లేదా? ఈ బిల్లు లేకపోతే పేదవారికి ఉచిత వైద్య సదుపాయం లభించటం లేదా? అంటూ వ్యతిరేక ధోరణిని ప్రతిబింబింపచేసే ప్రకటనలను కపిల్ సిబల్ చేయటం ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు కలిగిస్తున్నాయని ఆమె చెప్పారు. ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా లోక్‌పాల్ బిల్లు పరిధిలో ఉండాలా? వద్దా? అన్న విషయమై తమ పార్టీ అభిప్రాయాన్ని బిల్లును చూసిన తరువాతే వ్యక్తం చేస్తామని ఆమె చెప్పారు

0 comments:
Post a Comment