|
నందమూరి లక్ష్మీపార్వతి హరికథలు చెప్పడం మానేసి లక్షకోట్ల అవినీతి సంపదకు వారసుడైన వైఎస్ జగన్‌కు భజన పరురాలిగా మారిపోయారని తెలుగుదేశం పార్టీ అనుబంధ మహిళా విభాగమైన తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమవతి ఎద్దేవా చేశారు. సోమవారం నాడిక్కడ ఆమె విలేకరులతో మాట్లాడారు. ధన కాంక్ష, అధికార వ్యామోహం, పదవీ దాహంలో జగన్‌కు ఆమె ఎం దులోనూ తీసిపోరని, అందుకే చివరిదశలో అతని పంచన చేరారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టి ఘోరంగా ఓడిపోయి అన్నింటా భంగపడ్డ లక్ష్మీపార్వతి చివరకు జగన్‌కు అమ్ముడుపోయారన్నారు. జగన్ విసిరే బిస్కెట్ల కోసమే ఆమె వైఎస్సార్ కాంగ్రెస్‌కు భజన చేస్తోందన్నారు.
www.Suryaa.com
www.Suryaa.com

0 comments:
Post a Comment